రిస్కీ రోల్స్ కి రెడీ అంటోన్న ‘మమ్మీ’ కాజల్!

పెళ్లి తరువాత మిసెస్ కిచ్లూ ప్రయోగాలకి ఉత్సాహంగా సిద్ధపడుతోంది. గతంలో కేవలం గ్లామర్ పాత్రలే చేసిన కాజల్ ఇప్పుడు రిస్క్ తీసుకోవటానికి రెడీ అవుతోంది. సినిమాలు, సీరియల్స్ ఒకేసారి హ్యాండిల్ చేస్తోన్న టాలెంట్ బ్యూటీ రీసెంట్ గా ఓ తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘రౌడీ బేబీ’ పేరుతో తెరకెక్కే ఈ సినిమా హారర్ థ్రిల్లర్ అంటున్నారు.

Read Also: లవ్, బ్రేకప్ రెండూ అయిపోయాయి…!

కాజల్ కి హారర్ జానర్ కొత్తేం కాదు. అయితే, ఈసారి ‘రౌడీ బేబీ’లో ఆమె తల్లిగా కనిపించబోతోందట! ఓ అమ్మాయికి అమ్మగా కాజల్ డీ గ్లామ్ రోల్ చేయనుందని చెన్నై టాక్. సినిమా మొత్తం తల్లీకూతుళ్ల సెంటిమెంట్ పైనే నడుస్తుందని చెబుతున్నారు.

రమేశ్ పిల్లై నిర్మాణంలో శరవణన్ దర్శకత్వం వహించే ‘రౌడీ బేబీ’లో సత్యరాజ్, లక్ష్మీ రాయ్, రమ్యకృష్ణ లాంటి వారు కూడా నటించనున్నారు. కాజల్ పెళ్లి తరువాత ‘ఉమ’ అనే మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి కూడా పచ్చ జెండా ఊపింది. ఆ సినిమా షూటింగ్ ఈ మధ్యే మొదలైంది…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-