పనిమనిషి వాళ్ల పిల్లాడికి కాజల్ ఇంగ్లీష్ పాఠాలు

లాక్ డౌన్ కాలంలో సినిమా షూటింగులు లేక సినీతారలు తమ మిగితా టాలెంట్ ను బయటపెట్టారు. కాగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ లాక్ డౌన్ కాలంలో తన స్కిల్ ను చూపించింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె లాక్ డౌన్ ముచ్చట్లను చెప్పుకొచ్చింది. ‘కొవిడ్‌తో వచ్చిన విరామ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆన్‌లైన్‌ లో చాలా సబ్జెక్ట్‌లలో పరిజ్ఞానం పెంచుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే, వాళ్ళ పనిమనిషి అబ్బాయికి ఇంగ్లిష్ పాఠాలు కూడా చెప్పానని’ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘ఆచార్య’లో చిరంజీవికి జోడీగా నటిస్తోంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జునతో కలిసి ఓ చిత్రం చేస్తోంది. శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమాలోనూ నటిస్తుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-