బాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ కన్నుమూత!

బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులకు ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేసిన కైజాద్ కపాడియా బుధవారం కన్నుమూశాడు. ఎంతోమంది జీవన శైలిని మార్చిన కైజాద్ బాలీవుడ్ సెలబ్రిస్ ను సైతం తన వైపు తిప్పుకున్నాడు. అనేకమంది బాలీవుడ్ నటులకు ఆయన ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్నారు.

కైజాద్ హఠాన్మరణం పట్ల టైగర్ ష్రాఫ్ ఉదయమే సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలిపాడు. టైగర్ తల్లి ఆయేషా, సిద్ధాంత్ కపూర్, నీల్ నితిన్ ముకేశ్, డేన్నీ పాండే, రుస్లాన్ ముంతాజ్ తదితరులు కూడా కైజాద్ మృతికి సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. ఫిట్ నెస్ ట్రైనర్స్ చాలామంది కైజాద్ ను గురువుగా భావిస్తుంటారు. అయితే ఆయనెప్పుడూ సెలబ్రిటీస్ ట్రైనర్ అనే భావనను తలకు ఎక్కించుకోలేదు. కైజాద్ మరణానికి కారణం ఏమిటనేది తెలియ రాలేదు. ఇదిలా ఉంటేపలువురు అభిమానులు అంతిమ సంస్కారంలో పాల్గొనడానికి పూణే బయలుదేరి వెళ్ళారని తెలుస్తోంది.

-Advertisement-బాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ కన్నుమూత!

Related Articles

Latest Articles