బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌కు చురుగ్గా ఏర్పాట్లు…

క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్‌కు ఉప ఎన్నిక‌ను అక్టోబ‌ర్ 30 వ తేదీన నిర్వ‌హించ‌బోతున్నారు.  ఈ ఉప ఎన్నిక కోసం ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది.  కాగా, రేపు ఈ ఉప ఎన్నిక‌కు సంబంధించిన గెజిట్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. రేప‌టి నుంచి నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంది.  అక్టోబ‌ర్ 30 వ తేదీన ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంది.  జిల్లా వ్యాప్తంగా ఇప్ప‌టికే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్టు క‌డ‌ప క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.  జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టుల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు ఆయ‌న తెల‌పారు.  బ‌ద్వేలు నియోజ‌కవ‌ర్గం ప‌రిథిలో మొత్తం 2,16,139 మంది ఓట‌ర్లు ఉండగా, ఇందులో 1,08,777 మంది పురుషులు, 1,07,340 మ‌హిళా ఓట‌ర్లు ఉన్న‌ట్టుగా అధికారులు తెలిపారు.  ఎన్నిక‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు క‌లెక్టర్ పేర్కొన్నారు.  

Read: పంజాబ్‌లో మరో కొత్త పార్టీకి శ్రీకారం… కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుందా?

-Advertisement-బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌కు చురుగ్గా ఏర్పాట్లు...

Related Articles

Latest Articles