ఆ చెక్‌డ్యామ్‌ను బాంబుల‌తో పేల్చివేసిన ప్ర‌భుత్వం… ఇదే కార‌ణం…

త‌మిళ‌నాడులో విల్లుపురం జిల్లా, క‌డ‌లూరు జిల్లా స‌రిహ‌ద్దు గ్రామాల వ‌ద్ధ ద‌క్షిణ పెన్నాన‌దిపై రూ.25 కోట్ల రూపాయ‌ల‌తో చెక్‌డ్యామ్‌ను నిర్మించారు. గ‌తేడాది సెప్టెంబ‌ర్ నుంచి ఈ డ్యామ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చారు.  కాగా ఈ ఏడాది జ‌న‌వ‌రి 23 వ తేదీన ఆన‌క‌ట్ట క్ర‌స్ట్‌గేట్ల గోడ పాక్షికంగా దెబ్బ‌తిన్న‌ది.  గోడ ప‌గుళ్ల నుంచి నీరు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టంతో ఈ వ్య‌వ‌హారంలో బాధ్యుల‌ను చేస్తూ ఆరుగురు అధికారుల‌ను ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది.

Read: ఆ గుర్రానికి కోట్లు ఇస్తామ‌న్నా… నో చెబుతున్నారు… ఎందుకంటే…

రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రూ.15 కోట్ల రూపాయ‌ల‌తో మ‌ర‌మ్మ‌త్తులు చేయాల‌ని నిర్ణ‌యించింది.  ఈలోగా త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు కురిశాయి.  దీంతో పెన్నాన‌దికి వ‌ర‌ద ఉదృతి పెరిగింది.  ఎగువ ద‌క్షిణ పెన్నాన‌దిలో తాత్కాలికంగా ఇసుక బ‌స్తాలు వేసి అడ్డుక‌ట్ట వేయాల‌ని చూసినా కుద‌ర‌లేదు.  పెన్నాన‌దిలో వ‌ర‌ద ఉదృతి పెర‌గ‌డంతో ఆదివారం రోజున క్ర‌స్ట్ గేట్ల‌ను బాంబుల‌తో కొంత‌మేర పేల్చివేశారు.  సోమ‌వారం రోజున కూడా బాంబులతో చెక్ డ్యామ్‌ను పేల్చివేసి గ్రామాలను వ‌ర‌ద‌బారి నుంచి కాపాడిన‌ట్టు అధికారులు తెలిపారు.  

Related Articles

Latest Articles