కేంద్ర మంత్రి వ‌ర్గంలో భారీ మార్పులుః  జ్యోతిరాదిత్య‌కు చోటు..!?

కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోబుతున్నాయి.  రెండు రోజుల క్రితం కీల‌క నేత‌లు ప్ర‌ధాని నివాసంలో సుదీర్ఘంగా చ‌ర్చ‌లు జ‌రిపారు.  వచ్చే ఏడాది యూపీ, గుజ‌రాత్ రాష్ట్రాల‌కు ఎన్నికలు జ‌ర‌గ‌బోతున్న త‌రుణంలో కేంద్ర మంత్రివ‌ర్గంలో మార్పులు, చేర్పులు ఉండ‌బోతున్నాయి.  కేంద్ర మంత్రివ‌ర్గంలో 60 మంది కేంద్ర‌కేబినెట్ ను 80 కి పెంచే అవ‌కాశం ఉన్న‌ది.  ఇప్ప‌టికే 20 వ‌ర‌కు ఖాళీగా ఉన్నాయి. కీలక మంత్రులు ఒక‌టి కంటే ఎక్కువ శాఖ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.  దీంతో ఖాళీగా ఉన్న శాఖ‌ల‌ను భ‌ర్తీ చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం.  మ‌ధ్య‌ప్ర‌దేశ్ కీల‌క నేత‌, బీజేపీ రాజ్య‌స‌భ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియాకు కేబినెట్ లో చోటు ద‌క్క‌బోతున్న‌ట్టు స‌మాచారం.  మ‌ధ్యప్ర‌దేశ్ లో బీజేపీ తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు జ్యోతిరాదిత్య సింథియా కీల‌క పాత్ర పోషించారు.  దీంతో సింథియాకు రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌వి ద‌క్కింది. కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. సింథియాతో పాటుగా, బీహార్ ఉప‌ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన సుశీల్ కుమార్ మోడీకి, మ‌రికొంత‌మందికి కూడా మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-