సూర్య-జ్యోతిక @15 ఇయర్స్

సౌత్ స్టార్స్ కపుల్ సూర్య-జ్యోతిక నేడు 15వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. వీరిద్దరి లవెబుల్ జోడికి కోలీవుడ్ లోనే కాదు, సౌత్ అంతటా కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు. కొద్దిరోజుల పాటు ప్రేమలోవున్న వీరు 2006లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తరువాత జ్యోతిక సినిమాలు చేసే అవకాశం పుష్కలంగా వున్న.. కాదనున్నది. ఆపై హస్బెండ్ సూర్య సైతం సపోర్ట్ చేశాడు. అయినా జ్యోతిక పూర్తిగా కుటుంబానికే పరిమితం అయింది. ఆ తర్వాత పిల్లలు స్కూల్ వెళ్లే స్టేజ్ కి రావడంతో జ్యోతికకు తీరిక దొరికింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి, ఇప్పటి స్టార్ హీరోయిన్స్ కు పోటీనిస్తుంది. ఆమెకు సరిపడా కథలను ఎంచుకొంటూ.. లేడీ ఓరియెంటెడ్ పాత్రలో తనకు తానే సాటి అనేలా రానిపిస్తోంది.

సూర్య-జ్యోతిక జోడి చాలా మంది సినీప్రముఖులకు కూడా ఆదర్శవంతమైన జంట.. వీరిద్దరూ చూడ్డానికే కాకుండా ఒకరిని ఒకరు గౌరవించుకొనే తీరు ఆకట్టుకొనేలా కనిపిస్తోంది. చాలా ఇంటర్వ్యూలో వీరిద్దరి మధ్య ప్రేమ చాలా గొప్పగా కనిపిస్తోంది. అందుకే యూత్ లో ఈ కపుల్స్ కి అంతా క్రేజ్ వుంది. ఇక ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన జ్యోతికకు విపరీతమైన ఫాలోవర్స్ పెరిగారు. ప్రస్తుతం ఆమెకు ఇప్పుడు దాదాపు 16 లక్షల మంది ఫాలోవర్లు వున్నారు. అయితే నేడు పెళ్లి రోజు కావడంతో జ్యోతిక, సూర్యకు శుభాకాంక్షలు తెలిపింది. 15 ఇయర్స్ సంతోషం.. మీ అందరి ప్రేమ & ఆశీర్వాదాలకు ధన్యవాదాలు..’ అంటూ జ్యోతిక-సూర్య ఫోటోను ఆమె అభిమానులకు షేర్ చేసింది. ప్రస్తుతం పలు సినీప్రముఖులు, అభిమానులు ఈ కపుల్స్ కి వెడ్డింగ్ డే విషెస్ తెలియచేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Jyotika (@jyotika)

Related Articles

Latest Articles

-Advertisement-