సామాజిక న్యాయానికి సీఎం జగన్‌ ప్రతిరూపం-జూపూడి

సామాజిక న్యాయానికి ప్రతిరూపం సీఎం వైఎస్‌ జగన్‌ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేవారు జూపూడి ప్రభాకర్‌… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు నామినేటెడ్ పదవుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారన్న ఆయన.. తన కేబిన్‌లో కూడా బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించారని ప్రశంసించారు.. చంద్రబాబు హయాంలో ఎందుకు సామాజిక న్యాయం పాటించలేక పోయారు? అని ప్రశ్నించిన జూపూడి.. ఒక ఎస్టీని డీజీపీగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారని.. ఎస్టీ అధికారి సవాంగ్ ను పట్టుకొని టీడీపీ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని ఫైర్‌ అయ్యారు.. గతంలో సవాంగ్ ను డీజీపీ కాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించిన జూపూడి.. డీజీపీపై టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు..

చంద్రబాబు, లోకేష్ కు బుర్రలేదు.. టీడీపీలో మిగతా నేతలకు ఏమైంది అంటూ హాట్‌ కామెంట్లు చేశారు జూపూడి ప్రభాకర్‌.. సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్న ఆయన.. సీఎం చేస్తున్న సామాజిక న్యాయాన్ని చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారన్నారు.. బడుగు బలహీన వర్గాలకు సీఎం అత్యున్నతస్థాయి పదవులు ఇస్తుంటే టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. బీసీలకు 70 వేల కోట్ల రూపాయలు వివిధ పథకాలు ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసిందని.. ఎస్సీలకు 25 వేల కోట్లు, ఎస్టీలకు 7114 కోట్లు, మైనార్టీలకు 7118 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు.. బడుగు బలహీన వర్గాలకు ఇంకా ఖర్చు చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్న జూపూడి.. సంక్షేమ పథకాలు చూసి టీడీపీ నేతలు ఉరేసుకుని చావాలన్నారు. ఎస్సీలకు రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు జూపూడి ప్రభాకర్‌.

Related Articles

Latest Articles

-Advertisement-