నేటి నుంచి ఏపీ జూడాల సమ్మె

ఏపీ రాష్ట్రంలో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టనున్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీ జూనియర్‌ డాక్టర్లు (జూడా) సంఘం నేటి నుంచి విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. ఫ్రంట్‌లైన్‌ వారియర్లందరికీ ఆరోగ్య బీమా కల్పించాలని, కొవిడ్‌ ప్రోత్సాహకం ఇవ్వాలని, ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలని డిమాండు చేస్తున్నారు. కాగా ప్రభుత్వంతో జూడాలు రెండు సార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. నేడు మరోసారి ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఈరోజు ఆరోగ్య మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీతో జూనియర్లు డాక్టర్లు సమావేశం కానున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-