కడప జిల్లాలో విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు…

కడప జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు… రిమ్స్ లో బ్లాక్ రిబ్బన్స్ తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరోనా విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లకు 40 వేల వేతనం నుంచి 80 వేల కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా‌ విధులలో పాల్గొన్న డాక్టర్లకు కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేసారు. ఎన్నో నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదంటున్న డాక్టర్లు… న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కారించకపోతే విధులకు హాజరు కాలేమంటున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. చూడాలి మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-