తమ డిమాండ్లను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపు..

నేడు ఏపీ జూనియర్ డాక్టర్లు ఆందోళన జరుగుతుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చటం లేదంటున్న జూడాలు.. రుయా ఆసుపత్రిలో తొలుత నాన్ కొవిడ్, తర్వాత కొవిడ్ విధులను బహిష్కరించనున్నారు. కొవిడ్ ఇన్సెంటివ్​లు, ఉపకార వేతనాల నుంచి కోతలు, రోగుల కుటుంబ సభ్యుల నుంచి జూడాలకు భద్రత తదితర విషయాల్లో ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అయితే రెండు రోజుల కిందటే జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఈరోజు సమ్మెను ప్రారంభించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-