ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు…

ఏపీలో సమ్మెబాట పట్టనున్నారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చిన జూనియర్ డాక్టర్లు ఈ నెల 9 వ తేదీ నుండి విధులు బహిష్కరిస్తామన్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహ అన్ని బహిష్కరించనున్నారు. ఎస్‌ఆర్‌లకు స్టైఫండ్‌ పెంచాలని, కొవిడ్‌ డ్యూటీలు చేస్తున్న మెడికల్‌ విద్యార్థులకు ఇన్సెంటివ్స్‌ ఇవ్వాలని.. ఎస్‌ఆర్‌కు అందించే స్టైఫండ్‌ నుంచి టీడీఎస్‌ కటింగ్‌ లేకుండా చూడాలని వైద్యలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొవిడ్‌ విధులు నిర్వహించే జూనియర్‌ డాక్టర్లకు, ఎస్‌ఆర్‌లకు కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌కు అవకాశం కల్పించాలని అన్నారు. ఈ నాలుగు డిమాండ్లపై సమ్మెకు సిద్దం అవుతున్నారు వైద్యులు. చూడాలి మరి ఏపీ ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-