ఫేక్ న్యూస్… యంగ్ టైగర్ కారు కాదట…!

సెలబ్రిటీలు మార్కెట్‌లోకి వచ్చే ప్రతి మోడల్‌ స్పోర్ట్స్ బైక్‌లు, కార్లను కొనాలని, అందులో రైడ్ కు వెళ్లాలని కోరుకుంటారు. అదేవిధంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కార్లు అంటే చాలా ఇష్టం. నిజానికి ఆయన దగ్గర చాలా కార్లు ఉన్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఆయన కారు కొన్నారంటూ ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టిఆర్ ఒక సరికొత్త కారు లంబోర్ఘిని ఉరుస్ మోడల్ ను ప్రత్యేకంగా ఆర్డర్ చేశాడని అంటున్నారు. అంతేకాదు ఆ కారులో ముందుగా రామ్ చరణ్ ఇంటికే వెళ్లాడని, అందుకే రామ్ చరణ్ ఇంటి ముందు పార్క్ చేసి ఉందనేది ఆ వార్తల సారాంశం. కానీ అవన్నీ ఫేక్ న్యూస్ అని తెలుస్తోంది.

Read Also : అప్డేట్ : షూటింగ్ రీస్టార్ట్ చేయనున్న “ఖిలాడీ”

ఈ లంబోర్ఘిని కారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సొంతం కాదని ఆయన మేనేజర్, నిర్మాత మహేష్ ఎస్ కోనేరు స్పష్టం చేశారు. రామ్ చరణ్ ఇంటి ముందు ఆపి ఉంచిన లంబోర్ఘిని కారు వేరొకరికి చెందినది. లంబోర్ఘిని ఉరుస్ గంటకు 305 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇది 3.6 సెకన్లలో సున్నా నుండి 100కి చేరుకుంటుంది. లంబోర్ఘిని ఉరుస్ కోసం ఎన్టీఆర్ ఆర్డర్ చేశారట. కానీ ఇంకా డెలివరీ కాలేదని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం వహించిన “ఆర్‌ఆర్‌ఆర్‌”లో కనిపించనున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-