రాజమౌళి కీలక నిర్ణయం!

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేవ్ తగ్గడంతో మరికొద్ది రోజుల్లోనే షూటింగ్స్ పునప్రారంభం కానున్నాయి. కాగా సినీ అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్‌ఆర్‌ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇంకా క్లైమాక్స్‌ సన్నివేశాలతో పాటు కీలక యాక్షన్‌ సీన్ల చిత్రీకరించాల్సి ఉందట, దీనికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. దీంతో ముందుగా అనుకున్న డేట్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ను విడుదల చేయడం కుదరదని, మరోసారి విడుదల తేదీ మార్పుపై చర్చలు జరుగుతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 2022 ఏప్రిల్ 28న విడుదల చేస్తే బాగుంటుందని రాజమౌళి సూచించినట్లు తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-