‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్..?

నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం విడుదలకు సిద్దమవుతూన్న విషయం తెలిసిందే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 2 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ హడావిడి మొదలుపెట్టేసారు చిత్ర బృందం. ఇప్పటికే ‘అఖండ’ ట్రైలర్ ప్రేక్షకులను భారీ అంచనాలను పెట్టుకొనేలా చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది.

బాబాయ్ కోసం అబ్బాయి రంగంలోకి దిగనున్నాడంట. ఇక ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాడని సమాచారం. నందమూరి బాలకృష్ణ- జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించడం నందమూరి ఫ్యాన్స్ కి పండగే.. బాలకృష్ణ అన్న హరికృష్ణ మృతి తరువాత కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కి తండ్రి హోదాలో బాలకృష్ణ కొనసాగుతున్నారు. ఇక ఈ వేడుకకు ఎన్టీఆర్ తో పాటు మరో స్టార్ హీరో కూడా అటెండ్ కానున్నారని సమాచారం. అయితే ఆ హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది..మరి ఈ వార్తలపై ఒక క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles