అజయ్ దేవ్ గన్ ముందు మేం పిల్లలం: జూనియర్ ఎన్టీఆర్!

మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళితో పాటు సీనియర్ నటుడు అజయ్ దేవ్ గన్, ఎన్టీయార్, అలియా భట్, నిర్మాత డీవీవీ దానయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అజయ్ దేవ్ గన్ గురించి జూనియర్ ఎన్టీయార్ తన అభిప్రాయాన్ని చెబుతూ, అభిమానాన్ని చాటుకున్నాడు. అజయ్ దేవ్ గన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. అజయ్ దేవ్ గన్ తో తమను పోల్చవద్దని మీడియాను కోరాడు. ఆయన సీనియారిటీ ముందు తామంతా కిడ్స్ అని చెప్పాడు. వ్యక్తిగానూ అజయ్ దేవ్ గన్ గొప్ప వాడని చెప్పిన ఎన్టీయార్, అజయ్ దేవ్ గన్ మూవీ ‘ఫూల్ ఔర్ కాంటే’లో ఎంట్రీ సీన్ ను ఎప్పటికి మర్చిపోలేనని తెలిపాడు. అది కేవలం సినిమాల్లో జరుగుతుందని అన్నాడు. తన తాత ఎన్టీయార్, బాబాయి బాలకృష్ణ చిత్రాలు చూసి పెరిగిన తాను అజయ్ దేవ్ గన్ ను తెర మీద అలా చూసి స్టన్ అయ్యానని అన్నాడు. ‘ట్రిపుల్ ఆర్’లో తమ ఇద్దరి కాంబినేషన్ లో సీన్స్ లేకపోయినా అజయ్ దేవ్ గన్ నటిస్తున్న సమయంలో సెట్స్ కు వెళ్ళి ఆయన నటన చూస్తుండే వాడినని, అప్పటికీ ఇప్పటికీ ఆయనే యాక్షన్ మూవీస్ సూపర్ స్టార్ అని జూనియర్ ఎన్టీయార్ చెప్పాడు.

Related Articles

Latest Articles