‘ట్రిపుల్ ఆర్’ రిలీజ్ డేట్ లాక్ అయ్యింది!

మేగ్నమ్ ఓపస్ మూవీ, రియల్ మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’ రిలీజ్ డేట్ ను దర్శక ధీరుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ట్రిపుల్ ఆర్’ మూవీని వచ్చే యేడాది జనవరి 7వ తేదీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా రాజమౌళి తెలిపాడు. ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాను జనవరి 7 ఎక్స్ పీరియన్స్ చేయొచ్చని రాజమౌళి ట్వీట్ లో పేర్కొన్నాడు. రిలీజ్ డేట్ ను తెలియచేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశాడు. హిందీ సినిమా నిర్మాతలు మూడు నాలుగు రోజుల క్రితం తమ చిత్రాల విడుదల తేదీని ప్రకటిస్తున్న నేపథ్యం దర్శకుడు రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య నుండి ‘ట్రిపుల్ ఆర్’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని ఎన్టీయార్, రామ్ చరణ్ అభిమానులంతా ఎదురు చూశారు. ఈ లోగానే కొందరు ఈ సినిమాను జనవరి మొదటివారంలో విడుదల చేసే ఆస్కారం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

అదే సమయంలో సంజయ్ లీలా బన్సాలీ… అలియాభట్ నాయికగా తాను తెరకెక్కిస్తున్న ‘గంగూబాయి ఖతియావాడి’ ని జనవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తెలిపాడు. ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’ మూవీ 7న విడుదల కాబోతోంది. అంటే అలియా భట్ చిత్రాలు జనవరి 6, 7 తేదీలలో జనం ముందుకు వస్తాయన్నమాట. విశేషం ఏమంటే… ‘ట్రిపుల్ ఆర్’ మూవీతో అలియా భట్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఆమె నటించిన ‘గంగూబాయి ఖతియావాడి’ని కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు మొదలెట్టారు. మరి ‘ట్రిపుల్ ఆర్’ కారణంగా అలియాభట్ ‘గంగూబాయి’ రిలీజ్ ను సంజయ్ లీలా బన్సాలీ వేరే రోజుకు మార్చుకుంటాడేమో చూడాలి.

-Advertisement-'ట్రిపుల్ ఆర్' రిలీజ్ డేట్ లాక్ అయ్యింది!

Related Articles

Latest Articles