ఎన్టీఆర్ విషయంలో ఆ గ్యారంటీ ఇస్తున్న కొరటాల!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమాతో ఐదేళ్ళ కింద సంచలన విజయం సాధించిన వీరిద్దరు.. ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర రిపేర్లు చేయడానికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తిచేసుకొనే పనిలో పడ్డారు. త్వరలోనే కొరటాల-ఎన్టీఆర్ మూవీ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌లో సినిమా ఉంటుందని కొరటాల గ్యారెంటీ ఇస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్‌ ఇదివరకు చూడని రేంజ్‌లో కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. గతంలో ఎన్టీఆర్‌ చేయని ఓ డిఫరెంట్‌ రోల్‌ను డిజైన్‌ చేస్తున్నానని, క్యారెక్టర్ అద్భుతంగా వస్తుందని కొరటాల తెలిపాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-