బండి సంజయ్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : జేపీ నడ్డా

ఉద్యోగ బదీలీల అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టారు. అయితే కోవిడ్‌ నిబంధనలకు విరుద్దంగా ఆయన దీక్ష చేపట్టారంటూ నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్ని ఆయన అన్నారు.

అంతేకాకుండా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, బండి సంజయ్‌ కార్యాలయంలోకి బలవంతంగా వెళ్లి అరెస్ట్‌ చేశారని ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ సర్కార్‌పై ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తామని ఆయన అన్నారు. బండి సంజయ్ కు అండగా మేముంటామని ఆయన వెల్లడించారు.

Related Articles

Latest Articles