ఈటల చేరికపై నడ్డా కీలక వ్యాఖ్యలు…

ఢిల్లీలో బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డాతో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్, రాష్ట్ర బిజేపి ఇంచార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎంపి వివేక్ వేంకటేస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జె.పి నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. బిజేపిలో చేరాలన్న ఈటల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… తెలంగాణలో బిజేపి మరింత చురుకైన పాత్ర పోషిం చేందుకు సమాయత్తం కావాలని రాష్ట్ర నాయకులకు నడ్డా సూచించారు. ఉద్యమ నాయకులతో పార్టీ బలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. బిజేపిలో ఈటల నిర్వహించే బాధ్యతలపై ఓ వారంలో అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకోనుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-