తెలకపల్లి రవి: హుజూరాబాద్‌లో సరికొత్త మలుపులు

మాజీ మంత్రిఈటెల రాజేందర్‌ బిజెపిలో చేరిక తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాజేందర్‌పై సానుభూతి టిఆర్‌ఎస్‌ అధికార బలం మధ్యనే పోటీ అనుకున్నది కాస్తా రకరకాల మలుపులు తిరుగుతున్నది. ఆరుమాసాల్లో ఉప ఎన్నిక జరపాలనే నిబంధన వున్నా కోవిడ్‌ నేపథ్యంలోఅదే సందేహంలో పడిరది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిని మార్చడం, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత మరోచోట పోటీ చేసి గెలిచే అవకాశంపైనా అనుమానాలు హుజూరాబాద్‌నూ సందేహంలో నెట్టాయి. ఈటెల రాజేందర్‌పై సానుభూతి ప్రధానంగా పోటీ జరుగుతుందన్న వాతావరణం వెనక్కుపోయి బిజెపి టిఆర్‌ఎస్‌ పోటీగా పరిణమిస్తున్నది.  ఈటెల వెంట పార్టీ శ్రేణులుఏ మేరకు తరలిపోతాయన్న  అంచనాలు అలా వుంటే ాటి కాంగ్రెస్‌కు రేవంత్‌ రెడ్డి అద్యక్షుడు కావడంతో అక్కడా హడావుడి పెరిగింది. అయితే రేవంత్‌ రెడ్డి మొదట్లోనే ఈటెలకు సానుభూతి ఓట్లతో గెలిచే అవకాశం ఎక్కువని వ్యాఖ్యానించడంతో ఆయన ఆలోచన ఏమిటనే ప్రశ్న కూడా వచ్చింది. ఎందుకంటే పదవీ బాధ్యతలు స్వీకరించాక వచ్చే మొదటి ఉప ఎన్నిక రాజకీయంగా కీలకమైన  పోరాటంలో బిజెపి అభ్యర్థి సానుభూతి గురించి ముందే ఒప్పేసుకోవడం కాంగ్రెస్‌ నాయకులు చాలామందికి మింగుడు పడలేదు.

ఈటెల వ్యక్తిగత పోటీగా వుంటే ఎలా వుండేదో గాని బిజెపిలోచేరడం  ఎన్నికల స్వరూపాన్ని మార్చేసింది. కరీంనగర్‌ ఆ పార్టీకి బలమైన కేంద్రమే గతంలోనూ ఇప్పుడూకూడా ఆ పార్టీ నాయకులు ఎంపిలు ఎంఎల్‌ఎలు కావడమే గాక ప్రస్తుత  రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌ కూడా అక్కడే గెలుపొందారు.ఈటెల కూడా దీర్ఘకాలంగా అక్కడ నాయకుడుగా మంత్రిగా పట్టు కలిగివున్నారు. అయితే బిజెపి నాయకులు ఏకోన్ముఖంగా ఆయన గెలుపుపై కేంద్రీకరిస్తున్నారా వూపు తగ్గకుండా చూస్తున్నారా అంటే చెప్పడానికి లేదు.ఒకరిద్దరు నాయకులు తప్ప అత్యధికులు ఆయనపైనే  భారం వేసినట్టు కనిపిస్తుంది. మరోవైపున జాతీయ పార్టీలో చేరారు గనక నిర్ణయాలు పైనే జరగవలసి వుంటుంది. ఈటెల భార్య జమున తానైనా తన భర్త అయినా ఎవరు పోటీ చేసినా ఒకటే నని చెప్పడం బిజెపి ఆమోదంతో జరిగిందా?అనేది ఆ కోణంలో ప్రశ్నార్థకం. ఆమె అలా ఎందుకన్నారు? ఈటెల ఓటమి పాలైతే భవిష్యత్‌లో నష్టం గనక ఆమెను నిలబెట్టాలనే ఆలోచన వున్నట్టు ఒక దశలో వినిపించినదానికిది కొనసాగింపా? ఆమె నిలబడితే సామాజిక సమీకరణలో బిసి కార్డు దెబ్బతినదా? ఇలాటి ప్రశ్నలున్నాయి.పైగా కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ ఎవరైనా ఒకటేననడం తర్క విరుద్ధం అవుతుంది. పాదయాత్రలో ఈటెల ఓడిపోకుండా చూడాలన్నట్టు మాట్లాడటం కనిపిస్తుంది. తన హత్యకు కుట్ర జరిగిందనే తీవ్ర ఆరోపణ చేసిన ఆయన ఆ మేరకు తర్వాతనైనా పోలీసు ఫిర్యాదు ఇస్తారా? రక్షణ తీసుకుంటారా?వంటిప్రశ్నలున్నాయి. జిల్లామంత్రి గంగుల కమలాకర్‌ తను ఏ విచారణకైనా సిద్ధమని సవాలు చేయడంపై ఎలా స్పందిస్తారో కూడాచూడాలి. మొత్తంపైన జిల్లాలో టిఆర్‌ఎస్‌ శ్రేణులు ఈటెలతో పాటే కదిలివస్తున్నట్టు కనిపించదు. ఆయన బిజెపి కండువా కప్పుకోవడం అందుకు కారణమైంది. రాష్ట్రంలో పాలకపార్టీని వదిలిరావడానికి వారు సిద్దం అంత సులభం కాదు. ఎన్నికలు ఎప్పుడో వస్తే అప్పటిదాకా సానుభూతిని పట్టుకురావడమే పెద్ద సవాలు.బిజెపిమీద వచ్చే రాజకీయ విమర్శలు కూడా

పదవి కోల్పోయిన ఈటెల శిబిరం కన్నా పాలక టిఆర్‌ఎస్‌ దూకుడు ఎక్కువగా వుంది.సాక్షాత్తూ ముఖ్యమంత్రి కెసిఆర్‌,కెటిఆర్‌,హరిష్‌ రావువంటివారు స్వయంగా రంగంలోకి దిగిబలాలను మోహరించడం హుజూరాబాద్‌ పోటీ రాజీకీయ ప్రాధాన్యతపెంచేసింది. టిడిపి రాష్ట్ర అద్యక్షుడుఎల్‌.రమణ ,కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి కౌశిక్‌రెడ్డితో చాలా మంది స్థానిక నేతల చేరిక అధికార పక్షానికి కొత్త బలం అవుతుంది. ఇందులో రాజకీయ బలంతో పాటు సామాజిక సమీకరణలు కూడా దృష్టిలో వున్నట్టు స్పష్టమవుతుంది. అందులోనూ గత ఎన్నికల్లో అరవై వేల ఓట్లు తెచ్చుకున్న  కౌశిక్‌ చేరిక  ఓట్లనూ పెంచవచ్చు.మరోవైపున దూకుడు వ్యూహం తనదనే రేవంత్‌ ముందుగానే ఇది తన ఎజెండాలో ముఖ్యం కాదన్న సంకేతాలిస్తున్నారు. తనను అభినందించిన మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి ఈటెలతో సమావేశం కావడం గందరగోళాన్ని పెంచింది. మరి ఎవరు ఎటు వైపు వస్తున్నారు, బిజెపి అభ్యర్థిని కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు కలుస్తున్నారనే ప్రశ్నను తీసుకొచ్చింది. రమణ,కౌశిక్‌లను చేర్చుకునే సందర్భంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్వయంగా హాజరై తీవ్రభాషలో ఎవరూ అడ్డుకోలేరంటూ మాట్లాడ్డం చూస్తే  రాబోయే ఎన్నికలకు హుజూరాబాద్‌ను ఒక ముందస్తు సూచికగా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇన్నిటి మధ్యనా అక్కడ ఏమిజరిగేది ఓటర్లు నిర్ణయంపై ఆధారపడి వుంటే అసలు ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఎన్నికల కమిషన్‌ ప్రకటన కోసం చూడవలసివుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-