వ్యాక్సినేషన్‌.. భారత్‌లో త్వరలోనే ఆ వ్యాక్సిన్‌ తొలిడోసు..!

కరోనాపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. ఇప్పటికే భారత్‌లో వ్యాక్సినేషన్‌ ఊపందుకుంది.. ఒకప్పుడు రోజుకు లక్షల్లో డోసులు వేసే స్థాయి నుంచి ఇప్పుడు ఒకేరోజులో రెండు కోట్లకుపైగా వ్యాక్సిన్లు వేసి రికార్డు సృష్టించింది భారత్.. ఇక, వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను మ‌రింత ముమ్మరం చేసే దిశ‌గా ప్రయత్నాలు చేస్తోంది.. డిసెంబ‌ర్ నాటికి దేశ‌వ్యాప్తంగా అర్హులైన జ‌నాభా అంత‌టికీ క‌నీసం క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు అందించాల‌నే ల‌క్ష్యం నెర‌వేరేందుకు ప్రభుత్వం వ్యాక్సినేష‌న్ ప్రక్రియను వేగవంతం చేసింది. అందులో భాగంగా.. మరో విదేశీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాబోతోంది.. అక్టోబ‌ర్ నుంచి భార‌త్‌కు జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ తొలి డోసుల స‌ర‌ఫ‌రా ప్రారంభం కానుంది. మొదటి విడతలో 4.35 కోట్ల డోసులు భారత్‌కు చేసుకుంటాయని తెలుస్తోంది. ఇక, అక్టోబ‌ర్‌ నెలలోనే 30 కోట్ల టీకా డోసుల పంపిణీ చేప‌ట్టాల‌న్న భారత్‌ టార్గెట్‌కు ఇది మరింత దోహదపడుతుందని చెబుతున్నారు. కాగా, మొదటల్లో ఓసారి దరఖాస్తు చేసి వెనక్కి వెళ్లిపోయిన జాన్సన్‌ అండ్ జాన్సన్.. మరోసార దరఖాస్తు చేసుకోవడం.. దానికి భారత ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిపోయిన సంగతి తెలిసిందే.

-Advertisement-వ్యాక్సినేషన్‌.. భారత్‌లో త్వరలోనే ఆ వ్యాక్సిన్‌ తొలిడోసు..!

Related Articles

Latest Articles