అభిమానుల ఫోన్ లాక్కొన్న స్టార్ హీరో.. నడిరోడ్డుపై అలా చేసి

సెలబ్రిటీలు అన్నాకా నిత్యం అభిమానులు వారి చుట్టూనే తిరుగుతుంటారు.. ఇక వారు రోడ్లపై కనిపిస్తే సెల్ఫీలు, వీడియోలు అంటూ ఎగబడతారు. ఆలా కుదరకపోతే సీక్రెట్ గానైనా తమ అభిమాన తారలను కెమెరాల్లో బంధిస్తారు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు కొంతమంది తారలు ఫోటోలకు పోజులు ఇవ్వాలంటే చిరాకుగా చూస్తారు. మరికొందరు తమ అభిమానులను ఇబ్బంది పెట్టకుండా ఓపికగా వారికి ఫోటోలు ఇస్తారు. ఈ రెండు కాకుండా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు.

ముంబైలో ఉదయం వాకింగ్ చేస్తున్న జాన్ అబ్రహంను బైక్ ఫై వెళ్లే ఇద్దరు యువకులు వీడియో తీశారు. జాన్ కి తెలియకుండా చేద్దామనుకున్నారు కానీ అప్పటికే జాన్ ఆ వీడియోను చూసాడు. వెంటనే వారివద్దకు వచ్చి ఫోన్ లాక్కున్నాడు. దీంతో ఆ ఇద్దరు యువకులు ఫోన్ పగలకొడతాడేమో అనుకున్నారు.. కానీ, జాన్ అబ్రహం ఫోన్‌లో కెమెరా ఆన్ చేసి తన అభిమానులతో ‘హయ్ హౌ ఆర్ యూ?’ అన్నాడు. ఆ తర్వాత ఆ సెల్ఫీ కెమెరాలో ‘హే, యూ గయ్స్ ఓకే? వీరు నా స్నేహితులు’ అన్నాడు. ఆపై ఆ ఫోన్‌ను వారికి ఇచ్చేశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ అయిన యువకులు జాన్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. ‘హౌ హంబుల్ జాన్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం జాన్ అబ్రహం సత్యమేవ జయతే 2′ లో నటిస్తున్నాడు. నవంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది

Related Articles

Latest Articles