ఇండస్ట్రీని వదలని కరోనా.. మరో ముగ్గురు స్టార్లకు పాజిటివ్

చిత్ర పరిశ్రమను కరోనా వదిలి పెట్టడం లేదు. రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా కేసులు పెరిగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నేడు మరో ముగ్గురు స్టార్లు కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ బాలాజీ మోషన్ పిక్చర్స్ అధినేత ఏక్తా కపూర్ కారోబా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసున్నప్పటికీనేను కరోనా బారిన పడ్డాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. దయచేసి ఇటీవల నన్ను కలిసిన వారందరు పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక మరోపక్క బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం, అతని సతీమణి ప్రియా రుంచల్‌ కూడా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని జాన్ అబ్రహం వెల్లడిస్తూ ” నేను, ప్రియా కరోనా బారిన పడ్డాము.. ప్రస్తుతం మేము ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాం.. మేమిద్దరం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాం. అయినా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం మా ఆరోగ్యం బాగానే ఉంది. స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయి” అని తెలిపారు. ఇక వీరు త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

Latest Articles