క్రీడా స్ఫూర్తిని చాటుకున్న ఇంగ్లాండ్ కెఫ్టెన్ జో రూట్…

క్రికెట్‌లో క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్‌ జో రూట్‌. టీ 20 బ్లాస్ల్ క్రికెట్‌లో భాగంగా యార్క్‌షైర్‌, లంకాషైర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. లంకాషైర్‌ ఇన్నింగ్స్‌లో లూక్‌ వెల్స్‌ మిడాఫ్‌ మీదుగా షాట్‌ ఆడి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న స్టీవెన్‌ క్రాప్ట్‌కు కాల్‌ ఇచ్చాడు. అయితే క్రాప్ట్‌ రన్‌ కోసం యత్నించి మధ్యలోనే పడిపోయాడు. కాలు పిక్క పట్టేయడంతో క్రాప్ట్‌ నొప్పితో విలవిల్లాడాడు. అప్పటికే బాల్ కీపర్‌ హ్యారీ డ్యూక్‌ చేతిలోకి వచ్చింది. బ్యాట్స్‌మన్‌ రనౌట్‌కు అవకాశమున్నా డ్యూక్‌ను వద్దంటూ వారించాడు జో రూట్. గాయపడిన క్రాప్ట్‌ను పక్కకు తీసుకెళ్లి ఫిజియోతో చికిత్స చేయించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-