ఆరు సినిమాలు… ఆరు రకాల సినిమాలతో… అలరించటానికి ‘జియో సినిమా’ సిద్ధం!

మలయాళ ప్రేక్షకులకి జియో సినిమా షడ్రసోపేతమైన విందు వడ్డించబోతోంది! ‘షట్’ అంటే ఆరు కాబట్టి… ఆరు రకాల రసాలతో ప్రేక్షకుల్ని ఆనందపరిచే సిక్స్ డిఫరెంట్ మూవీస్ వరుసగా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తోంది. జియో సినిమా ప్రకటించిన తాజా తేదీల ప్రకారం రెండు చిత్రాలు నేరుగా జనం ముందుకి వస్తున్నాయి. థియేట్రికల్ రిలీజ్ లేకుండానే ప్రేక్షకులకి అందుబాటులోకి రానున్న రెండు కొత్త సినిమాలు కాకుండా మరో నాలుగు క్రేజీ చిత్రాలు కూడా త్వరలోనే అందరూ చూడవచ్చు. విభిన్నమైన కథాంశాలతో, ప్రతిభావంతులైన నటీనటులతో, పేరెన్నికగన్న దర్శకులతో సదరు సినిమాలన్నీ ఎంతో ఆసక్తిని కలిగించేవే. వాటికి జియో సినిమా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా జత చేయటంతో దేశంలోని ఎవరైనా ఈ మల్లూవుడ్ క్రియేటివిటిని రుచి చూడవచ్చు…

Read More:శేఖర్ కమ్ములతో సినిమా… ఎగ్జయిటింగ్ లో ధనుష్!

‘కాయంకులమ్ కొచ్చున్నీ’ జూన్ 18న వస్తోంది. మోహన లాల్, నివిన్ పాలీ, ప్రియా ఆనంద్ నటించిన ఈ సినిమా ఓ పీరియడ్ డ్రామా. రతీశ్ అంబట్ దర్శకత్వంలో తెరకెక్కిన సెటైరియల్ థ్రిల్లర్ ‘కమ్మార సంభవం’ జూన్ 19 నుంచీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ‘క్లింట్’ మూవీ జూన్ 25న రిలీజ్ కాగా ఈ సినిమాలో ఆలోక్, ఉన్ని ముకుందన్, రీమా కలింగల్, వినయ్ ఫోర్టే నటించారు. అద్భుతమైన చిత్రకారుడైన ఎడ్మండ్ థామస్ క్లింట్ అనే ఓ బాలుడి కథని ‘క్లింట్’ మూవీగా దర్శకుడు హరి కుమార్ తెరకెక్కించాడు.
కలుషితమైపోతోన్న ఒక నదిని కాపాడేందుకు కేరళలోని ఒక చిన్నారితో కలసి ఓ అమెరికన్ టూరిస్ట్ చేసిన ప్రయత్నమే ‘పుళయమ్మ’. ఇది జూలై ఒకటిన స్ట్రెయిట్ గా డిజిటల్ రిలీజ్ అవుతోంది జియో సినిమా యాప్ లో! ఇక జీతూ జోసెఫ్ దర్శకత్వంలో కాళిదాస్ జయరామ్, అపర్ణా బాలమురళి నటించిన చిత్రం ‘మిష్టర్ అండ్ మిసెస్ రౌడీ’ కామెడీ జానర్ లో రూపొందింది. ఇది జూలై 4 నుంచీ స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ‘కుట్టి మామ’ వచ్చే నెల 7వ తేదీన జియో సినిమాపై అందుబాటులోకి రానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-