నాన్న బోనీ సినిమాలో… కూతురు ‘హెలెన్’!

ఇంత వరకూ ఆశించిన స్థాయి హిట్ రాకున్నా చేతి నిండా సినిమాలతో దూసుకుపోతోంది జాన్వీ కపూర్! ఆమెని ‘నెపో కిడ్’ అంటూ ఎంత మంది విమర్శించినా క్రమంగా నటనలోనూ మెరుగవుతోందన్నది వాస్తవమే! ఇక ఈ అతిలోక సుందరి కూతురు… యువలోక సుందరి… అందం విషయంలో అయితే సూపర్ ఫాస్ట్! జాన్వీ హాట్ లుక్స్ విషయంలో వందకి నూట పది మార్కులు కొట్టేసింది…

గ్లామర్ తో కెరీర్ నెట్టుకొస్తోన్న జాన్వీ కపూర్ ఇప్పుడు ఓ మంచి పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ మూవీకి సిద్ధం అవుతోంది. మలయాళ చిత్రం ‘హెలెన్’ హిందీ రీమేక్ లో నటించబోతోంది. చాలా రోజులుగా ప్రచారంలో ఉన్న ఈ బోనీ కపూర్ ఫిల్మ్ లో… నెక్ట్స్ మంత్ నుంచీ డాటర్ జాన్వీ పాల్గొననుంది. ‘హెలెన్’ హిందీ వర్షన్ కి ‘మిలీ’ టైటిల్ ని కన్సిడర్ చేస్తున్నారు. అయితే, కథలో భాగంగా మూవీ షూట్ చాలా చోట్ల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇండోర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నప్పటికీ తొలి షెడ్యూల్ తరువాత దేశంలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ ఉంటుందట. కరోనా లాక్ డౌన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఇంకా అవుట్ డోర్ షూటింగ్ విషయంలో దర్శకనిర్మాతలు ఓ నిర్ణయం తీసుకోలేదట. ‘హెలెన్’ డైరెక్టర్ మతుకుట్టీ జేవియరే ‘మిలీ’ని కూడా లీడ్ చేయనుండుగా… జాన్వీ నెక్ట్స్ మనకు తెర మీద కనిపించబోయేది మాత్రం… ‘గుడ్ లక్ జెర్రీ, దోస్తానా 2’ సినిమాల్లో.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-