ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న జెస్సీ!

బిగ్ బాస్ సీజన్ 5లో గత వారం అనారోగ్యం కారణంగా జస్వంత్ (జెస్సీ) హౌస్ నుండి బయటకు వచ్చాడు. అతనిది ఎలిమినేషన్ కాదని, కేవలం ఆరోగ్యపరమైన సమస్య ఉన్నందునే మరికొన్ని వైద్య పరీక్షల నిమిత్తం బయటకు పంపుతున్నట్టు నాగార్జున ప్రకటించాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఇక జెస్సీ తిరిగి వెళ్ళే ఆస్కారం లేదన్నది స్పష్టమైపోయింది. అందుకే అతనితో ఇంటి సభ్యులందరితోనూ నాగ్ పర్శనల్ గా ఫోన్ లో మాట్లాడించాడు. ఇంతకూ విషయం ఏమంటే…. బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి మూడు వారాలు, సీక్రెట్ రూమ్ లో ఒక వారం పాటు అనేక రకాలుగా ఇబ్బంది పడిన జెస్సీ ఇప్పుడు ఆ హౌస్ నుండి వచ్చిన తర్వాత బిగ్ బాస్ లాస్ట్ సీజన్స్ కంటెస్టెంట్స్ తో, లేటెస్ట్ సీజన్ నుండి ఇప్పటికే బయటకు వచ్చిన వారితోనూ కలిసి చిల్ అవుతున్నాడు.

తాను బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళటానికి కారణమైన వారితో, అలానే బయట ఉండి తనకు సపోర్ట్ చేసిన స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, సెల్ ఫోన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్రం ఏమంటే… హౌస్ నుండి బయటకు వచ్చేముందు బిత్తర చూపులు చూస్తూ, చాలా చాలా తేడాగా కనిపించిన జెస్సీ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రత్యేకంగా చెబితే కానీ ఓ నాలుగు వారాల పాటు అతను వెర్టిగోతో బాధపడ్డాడనే విషయం ఎవరికీ తెలియదన్నట్టుగా ఉంది. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన మరు నిమిషం నుండే జెస్సీకి ఆరోగ్యం మెరుగుపడటం మొదలైనట్టు అనిపిస్తోంది.

Related Articles

Latest Articles