“జెర్సీ” హిందీ ట్రైలర్… ఇది షాహిద్ టైం !

షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ ట్రైలర్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా తెలుగు సూపర్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’కి హిందీ రీమేక్. ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ మరో తెలుగు సినిమా హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌ను శాసించేలా కనిపిస్తున్నాడు. నాని ‘జెర్సీ’ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షాహిద్ కపూర్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.

Read Also : కైకాల ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా

ఈ 2.53 నిమిషాల ట్రైలర్‌ని చూసిన తర్వాత షాహిద్ కపూర్ ‘జెర్సీ’ లుక్ అతని ‘కబీర్ సింగ్’ లుక్‌కి చాలా దగ్గరగా అనిపిస్తుంది. జీవితంలో విఫలమైన క్రికెటర్ తన కొడుకు కోసం జెర్సీని కొనుగోలు చేయాలనే కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆయన క్రికెట్, వివాహ జీవితం ఎలా సాగింది? జెర్సీని కొనుగోలు చేశాడా ? లేదా ? అనేది కథాంశం. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. షాహిద్ కపూర్ నటించిన రెండో క్రికెట్ బేస్డ్ సినిమా ఇది. దీనికి ముందు షాహిద్ 2009లో “దిల్ బోలే హడిప్పా”లో రాణి ముఖర్జీ సరసన నటించాడు. ‘జెర్సీ’ విషయానికొస్తే… షాహిద్, మృణాల్ ఠాకూర్‌తో పాటు పంకజ్ కపూర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అమన్ గిల్, దిల్ రాజు, ఎస్ నాగ వంశీ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకుడు.

Related Articles

Latest Articles