తుది శ్వాస విడిచిన హాలీవుడ్ నిర్మాత, ఆస్కార్ విన్నర్ హెల్ మ్యాన్…

‘మిడ్ నైట్ కౌబాయ్’ సినిమా నిర్మించినందుకుగానూ ఆస్కార్ అందుకున్న సీనియర్ హాలీవుడ్ నిర్మాత జెరోమ్ హెల్ మ్యాన్ గత బుధవారం మరణించాడు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన 92వ ఏట అమెరికాలోని మసాచూసెట్స్ రాష్ట్రంలో తుది శ్వాస విడిచాడు. ‘మిడ్ నైట్ కౌబాయ్’ సినిమాతో ఆస్కార్ పొందిన హెల్ మ్యాన్ ‘కమింగ్ హోమ్’ మూవీకి అకాడమీ నామినేషన్ పొందాడు. ఆయన బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డ్ రాలేదుగానీ… ‘కమింగ్ హోమ్’ మూడు ఆస్కార్స్ స్వంతం చేసుకుంది. తన కెరీర్ మొత్తంలో ఏడు చిత్రాలు నిర్మించిన ఆయన 1964లో ‘ద వరల్డ్ ఆఫ్ హెన్రీ ఓరియెంట్’ రూపొందించాడు. 1966లో ‘ఏ ఫైన్ మ్యాడ్నెస్’, 1975లో ‘ద డే ఆఫ్ లోకస్ట్’ , 1986లో ‘ద మస్కిటో కోస్ట్’ చిత్రాలు విడుదల చేశాడు. 1979లో రిలీజైన ‘ప్రామిసెస్ ఇన్ ద డార్క్’ మూవీకి నిర్మాతగానే కాక దర్శకుడిగానూ వ్యవహరించాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-