కొత్త ప్రియుడి కోసం పిల్లల స్కూల్ మార్చేస్తోన్న జెన్నీఫర్ లోపెజ్!

మామూలు పిల్లలకు ఉండే కష్టాలు, ఇబ్బందులు హాలీవుడ్ స్టార్ కిడ్స్ కు ఉండవు. నిజమే… కానీ, వారి సమస్యలు వారికి ఉంటాయి! తాజాగా జెన్నీఫర్ లోపెజ్ ఇద్దరు పిల్లలకు అదే జరుగుతోంది. 13 ఏళ్ల వయస్సున్న ఆమె కవలలు ఇద్దరూ చాలా ఏళ్లుగా అమెరికాలోని మియామీలో చదువుకుం టున్నారు. కానీ, లెటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తే టీనేజ్ స్టార్ కిడ్స్ వెస్ట్ సైడ్ గా జర్నీ చేసి… లాస్ ఏంజిలిస్ లో ఫ్లైట్ దిగాల్సి వచ్చేలా ఉంది! ముందు ముందు చదువు అక్కడే కొనసాగేలా సూచనలు కనిపిస్తున్నాయి…జెలోగా అభిమానులు పిలుచుకునే జెన్నీఫర్ లోపెజ్ మరోసారి ప్రేమలో పడింది. కొంత కాలం క్రితం వరకూ అలెక్స్ రోడ్రిగెజ్ తో కాపురం పెట్టిన ఆమె హఠాత్తుగా విడిపోయింది.

కారణాలు ఏంటో స్పష్టంగా తెలియదు. అయితే, ఇప్పుడు లాస్ ఏంజిలెస్ లో ఈ బ్యూటిఫుల్ ఏంజిల్ కి కొత్త ప్రియుడు దొరికాడు. అతడితో జిమ్ లో ఎక్సర్సైజులు చేస్తూ … మధ్య విరామంలో, అలసట తీరేలా పబ్లిగ్గా ముద్దులు కూడా పెట్టుకుంటోందట! ఇంతకీ అతనెవరు అంటారా? హాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత అయిన బెన్ అఫ్లెక్! కొత్త ప్రియుడు బెన్ అఫ్లెక్ తో వ్యవహారం ఇంకా జెన్నిఫర్ అఫీషయల్ గా ప్రకటించలేదు. కానీ, వారిద్దరి మధ్యా సమ్ థింగ్, సమ్ థింగ్ సాగుతోందని అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు లోపెజ్ ఎల్ఏ నగరంలో ఓ స్కూల్ కి కూడా వెళ్లి సంప్రదింపులు జరిపిందట.

ఇది ఖచ్చితంగా మియామీలోని ఆమె పిల్లల కోసమే అంటున్నారు హాలీవుడ్ అబ్జర్వర్స్. త్వరలో తన ఇద్దరు ట్విన్స్ ని హాలీవుడ్ స్టార్ లాస్ ఏంజిలెస్ కి చేరుస్తుందని చెప్పుకుంటున్నారు. జెన్నీఫర్ ఇద్దరు పిల్లలు ఆమెకు మాజీ భర్త మార్క్ ఆంటోతో రిలేషన్ షిప్ వల్ల పుట్టారు. ప్రస్తుతం జెలోని డేట్ చేస్తోన్న బెన్ అఫ్లెక్ కి కూడా గతంలో పెళ్లైంది. ఆయనకి మొదటి భార్య వల్ల ముగ్గురు పిల్లలున్నారు! మనకు కాస్త కొత్తగా లేదా కన్ ఫ్యూజింగ్ గా ఉండొచ్చు కానీ అమెరికాలో ఇలాంటివన్నీ మామూలే! హాలీవుడ్ సెలబ్స్ విషయంలో అయితే మరింత ఎక్కువ…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-