బెజోస్‌…ఎల‌న్ మ‌స్క్ మ‌ధ్య మూన్ వార్‌…!!

2024లో నాసా చంద్రుని మీద‌కు మ‌నిషిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ది.  దీనికి సంబందించిన కాంట్రాక్ట్‌ను ఎల‌న్ మ‌స్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ద‌క్కించుకుంది.  ఈ కాంట్రాక్ట్ విలువ 2.9 బిలియ‌న్ డాల‌ర్లు.  దీనికోసం స్పేస్ ఎక్స్ సంస్థ హ్యుమ‌న్ ల్యాండింగ్ సిస్టంతో కూడిన రాకెట్‌ను త‌యారు చేస్తున్న‌ది.  అయితే, అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు సంస్థ బ్లూఆరిజిన్ న్యూ షెప‌ర్డ్ అనే వ్యోమ‌నౌక‌ను త‌యారు చేసింది.  ఈ నౌక‌లోనే ఇటీవ‌లే జెఫ్ బెజోస్‌, మ‌రో ముగ్గురు అంత‌రిక్ష యాత్ర చేశారు.  త‌మ సంస్థ‌కు మూన్‌పై ల్యాండింగ్ చేసే సామ‌ర్థ్యం క‌లిగిన స్పేష్ షిప్ ను త‌యారు చేసే సామ‌ర్థ్యం ఉంద‌ని, నాసా కాంట్రాక్ట్‌ను త‌మ సంస్థ‌కు అప్ప‌గిస్తే రూ.15 వేల కోట్ల రూపాయ‌ల డిస్కౌంట్ ఇస్తామ‌ని చెప్పింది.  

Read: “ఆదిపురుష్” హీరోయిన్ సినిమా లీక్

లిక్విడ్ హైడ్రోజ‌న్‌తో న‌డిచేలా బ్లూమూన్ ల్యాండ‌ర్‌ను త‌యారు చేస్తున్నామ‌ని, ల్యూనార్ ఐస్‌నుంచి సైతం ఇంధ‌నాన్ని నింపుకునే సామ‌ర్థ్యం ఉంటుంద‌ని, భ‌విష్య‌త్తులో సౌర‌వ్య‌వ‌స్థ‌లో ఎక్కువ‌దూరం ప్ర‌యాణం చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని జెఫ్ బెజోస్ పేర్కొన్నారు.  ఎల‌న్ మ‌స్క్‌కు ఇచ్చిన కాంట్రాక్ట్‌ను తిరిగి ద‌క్కించుకోవ‌డానికి జెఫ్ బెజోస్ పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం.  

-Advertisement-బెజోస్‌...ఎల‌న్ మ‌స్క్ మ‌ధ్య మూన్ వార్‌...!!

Related Articles

Latest Articles