వ‌చ్చేవార‌మే అంత‌రిక్షంలోకి జెఫ్ బెజోస్‌…

అంత‌రిక్షంలో ప్ర‌యాణం చేసేందుకు ప్ర‌ముఖులు పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే.  ఇప్ప‌టికే వ‌ర్జిన్ గెల‌క్టిక్ అధినేత రిచ‌ర్డ్ బ్రాన్స‌న్ రోద‌సిలోకి వెళ్లివ‌చ్చారు.  90 నిమిషాల‌సేపు ఈ యాత్ర కొన‌సాగింది.  నేల నుంచి 88 కిలోమీర‌ట్ల మేర రోద‌సిలోకి వెళ్లి వ‌చ్చారు.  రోద‌సిలోకి వెళ్లిన తొలి ప్రైవేట్ యాత్ర‌గా వ‌ర్జిన్ గెలాక్టిక్ రికార్డ్ సాధించింది.  కాగా, ఇప్పుడు అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ అంత‌రిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.  ఆయ‌న అంత‌రిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ ద్వారా అంత‌రిక్ష యాత్ర‌కు శ్రీకారం చుడుతున్నారు.  

Read: అప్పుడే పవర్ ఫుల్ బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ !

వీరి అంత‌రిక్ష యాత్ర‌కు ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి ల‌భించింది.  వ‌చ్చే మంగ‌ళ‌వారం రోజున జెఫ్ బెజోస్ తో పాటుగా ఆయ‌న సోద‌రుడు, మ‌రో ముగ్గురు ప‌శ్చిమ టెక్సాస్‌లో నుంచి న్యూషెప‌ర్డ్  వ్యోమ‌నౌక‌లో వీరు అంత‌రిక్షంలోకి వెళ్ల‌బోతున్నారు.  భూమి నుంచి 106 కిలోమీట‌ర్ల ఎత్తుకు వెళ్లి అక్క‌డి నుంచి వీరు కింద‌కు వ‌స్తారు.  ఈ వ్యోమ‌నౌక‌ను పునఃర్వినియోగ బూస్ట‌ర్ ద్వారా అంత‌రిక్షంలోకి పంపుతారు. అంత‌రిక్ష యాత్ర త‌రువాత ఈ నౌక పారాచూట్ స‌హాయంతో ఏడారి ప్రాంతంలో దిగుతుంది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-