అమెజాన్ నుంచి త‌ప్పుకుంటున్న జెఫ్…కొత్త సీఈవో ఎవ‌రంటే…

27 ఏళ్ల క్రితం జెఫ్ బెజోస్ అమెజాన్ సంస్థ‌ను స్థాపించారు.  అప్ప‌టి నుంచి ఈ సంస్థ ఈ కామ‌ర్స్ రంగంలో ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే.  అమెజాన్ ప్ర‌పంచం న‌లుమూల‌ల‌కు విస్త‌రించింది.  27 ఏళ్ల‌పాటు అమెజాన్ అభివృద్ధికి కృషి చేసిన జెఫ్ బెజోస్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.  సీఈవో బాధ్య‌త‌ల నుంచి తప్పుకోబోతున్నారు.  జులై 5 వ తేదీన జెఫ్ త‌న సీఈవో బాధ్య‌త‌న నుంచి త‌ప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు.  కొత్త సీఈవోగా అమెజాన్ ఆర్ధిక స‌ల‌హాదారుడిగా ప‌ని చేస్తున్న ఆండీ జాస్సీకి సీఈవో బాధ్య‌త‌లు అప్పగించ‌బోతున్నారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-