అమెజాన్‌ చీఫ్‌ అంతరిక్ష యాత్ర విజయవంతం

అమెజాన్‌ సంస్థను తక్కువ కాలంలోనే తిరుగులేని శక్తిగా మలచిన ఆ సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌.. అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తి చేశారు.. 11 నిమిషాల్లో 105 కిలోమీటర్లు ప్రయాణించి భూమికి తిరిగి వచ్చింది బెజోస్‌ బృందం.. ఆయన వెంట మరో ముగ్గురు ఈ అంతరిక్ష ప్రయాణం చేశారు. ఇవాళ సాయంత్రం 6.42 గంటలకు పశ్చిమ టెక్సాస్‌ నుంచి రోదసీలోకి దూసుకెళ్లిన బ్లూ ఆరిజిన్‌ సంస్థకు చెందిన న్యూ షెపర్డ్ స్పేస్‌ క్రాఫ్ట్.. 11 నిమిషాల్లో తిరిగి భూమికి చేరుకుంది.. అయితే, అంతరిక్ష యాత్రకు ముందు 45 నిమిషాల ముందే ఆ నలుగురు స్పేస్‌ షిప్‌లో కూర్చున్నారు.. స్పేస్‌ షిప్‌లో ప్రయాణం, దానికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి శిక్షణ కార్యక్రమం కూడా ఉంది. కాగా, రోదసి పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్‌ అధినేత స్వీయ సంస్థ ‘బ్లూ ఆరిజిన్‌’ ఈ యాత్రను చేపట్టింది. జెఫ్‌ బెజోస్‌, ఆయన సోదరుడితో పాటు మరో ఇద్దరు అంతరిక్ష ప్రయాణాన్ని సాగించారు..

బ్లూ ఆరిజిన్‌కి చెందిన న్యూ షెపర్డ్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లే సమయంలో గంటకు 3700 కిలోమీటర్లు వేగంతో రాకెట్‌ దూసుకెళ్లింది… నౌక బయలుదేరిన 2 నిమిషాలకు వ్యోమగాములు 3 రెట్లు ఎక్కువ గురుత్వాకర్షణ శక్తికి లోను కూగా.. అనంతరం సీటు బెల్టులను తొలగించి భార రహితస్థితిని ఆస్వాదించారని తెలిపారు.. స్పేస్‌ షిప్‌ ప్రయాణం ప్రారంభమైన 6 నిమిషాలకు క్యాప్స్యూల్‌ నుంచి విడిపోయిన బూస్టర్‌ రాకెట్‌ తిరిగి భూ వాతావరణంలోకి పునర్‌ ప్రవేశించింది. ప్రయోగ వేదికకు 3.2కిలోమీటర్ల దూరంలోని ల్యాండింగ్‌ ప్యాడ్‌కు చేరుకుంది. అయితే, క్యాప్స్యూల్‌ మాత్రం సముద్రమట్టానికి 100కిలోమీటర్ల ఎగువన ఉన్న కార్‌మాన్‌ రేఖ వరకూ ప్రయాణించింది. ఆ సమయంలో వ్యోమగాములు కొద్దిసేపు భారరరహిత స్థితిని పొందారు. అనంతరం వ్యోమనౌక పారాచూట్ల సహాయంతో తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో గంటకు 16కిలోమీటర్ల స్థాయికి వేగాన్ని తగ్గించుకుంటూ కిందకు దిగింది. దాదాపు 15నిమిషాల పాటు ఈ అంతరిక్ష యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో పాల్గొన్న నలుగురు వ్యోమగాములు విజయసంకేతం చూపుతూ క్యాప్స్యూల్‌ నుంచి బయటకు వచ్చారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-