బండ్ల గణేష్‌కు ఆన్సర్ ఇవ్వటం టైమ్ వేస్ట్: జీవిత

‘మా’ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో బరిలో ఉన్న సభ్యులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇక నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్‌ సభ్యులతో ఈరోజు సమావేశయ్యారు. ‘మా’ సభ్యులందరిని విందుకు ఆహ్వానించారు. దీంతో బండ్ల గణేశ్‌ ‘మా’ సభ్యులను విందుకు ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా భయంతో బ్రతుకుతున్న ఇటువంటి సమయంలో సినీకళాకారులందరిని విందు పేరుతో ఒక దగ్గర సమావేశపరచడాన్ని బండ్ల తప్పుబట్టారు.

అయితే, బండ్ల గణేష్ వ్యాఖ్యలకు జీవితరాజశేఖర్ స్పందించారు. బండ్ల గణేష్ ఆన్సర్ ఇవ్వడం కూడా వెస్ట్ అన్నారు జీవిత.. మా ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ చాలా సార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఆయన విజన్ బాగా నచ్చింది. అందుకే ఆయనతో కలిసి పనిచేయాలని అనుకున్నాం.. తెలుగులోనే కాదు, అన్ని పరిశ్రమల్లో ప్రకాష్ రాజ్ పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పనిచేసిన అనుభవం వుంది. చాలా ఫౌండేషన్స్ పెట్టారు. నిధుల విషయంలోనే నైనా, సహాయం విషయంలోనే ఆయన ఉంటే బాగుంటుందనే ఉదేశ్యంతోనే మద్దతు ప్రకటించాను.

ప్రస్తుతం కరోనా నిబంధనలతో అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు జీవిత. ఇదివరకుతో పోలిస్తే ప్రజల్లో బాగా అవగాహన వచ్చింది. అన్ని కోవిడ్ రూల్స్ పాటిస్తూనే ఈరోజు మీటింగ్ జరిగిందని.. బండ్ల కామెంట్స్ కు జీవిత కౌంటర్ ఇచ్చారు. ‘మా’ సభ్యుల్లో ఎవరి సలహా ఏంటి..? రేపు గెలిస్తే ఏంచేస్తారు..? అనే ఏజెండా మీదనే ఈరోజు మీటింగ్ జరిగిందన్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-