ఎన్టీఆర్‌కు సారీ చెప్పిన జీవిత

మా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వివాదాలు పెరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్, విష్ణు మంచు ప్యానెల్స్ మధ్యలో మాటల యుద్ధం మరింతగా ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తీవ్రపదజాలంతో తూలనాడుకుంటున్నారు. అందులో భాగంగా ఇతరులను కూడా అన్యాపదేశంగా ఎన్నికల ముగ్గులోకి లాగుతున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌ లో పోటీ చేస్తున్న జీవితారాజశేఖర్ జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేయడానికి ఆసక్తి చూపటం లేదని మీడియాకు చెప్పారు. ఇటీవల ఓ వేడుకలో ఎన్‌టిఆర్‌ని కలిసినపుడు మా లో జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారని, ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయడానికి నిరాసక్తత వ్యక్తం చేసారని జీవిత తెలిపారు.

Read Also : ‘వేధింపులు’ అంటూ సమంత స్టైలిస్ట్ షాకింగ్ పోస్ట్

ఇక మంచు విష్ణు లైవ్ షోలో ఎన్టీఆర్ తనకు ఓటు వేస్తానని హామీ ఇచ్చారన్నాడు. దీంతో జీవిత తను మీడియాతో చెప్పిన మాటలను వెనక్కి తీసుకుని, ఎన్టీఆర్‌కు క్షమాపణలు చెప్పారు. తను ఎన్టీఆర్ నిరాసక్తత గురించి చెప్పిన విషయం మా మెంబర్లను తప్పుదోవ పట్టిస్తుందని అంగీకరించారు. ఎన్టీఆర్ కాజువల్ గా చర్చించిన విషయాలను తను మీడిమా ముందు వెల్లడించటం సమస్యగా మారిందని జీవిత అంగీకరించారు. మా లో నెలకొని ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత బాధగా ఉందని ఎన్టీఆర్ చెప్పారని, తనని ఓటు వేయమని అభ్యర్థించినప్పుడు తను ఏమీ చెప్పలేదన్న సంగతిని వివరించారు జీవిత.

-Advertisement-ఎన్టీఆర్‌కు సారీ చెప్పిన జీవిత

Related Articles

Latest Articles