పోసాని గారి మాటలు మీద యాక్షన్ తీసుకోవాలి: జీవితా

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీదారుల మధ్య విమర్శల పోరు పెరిగింది. తాజాగా జీవితా రాజశేఖర్‌ మరోసారి నరేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘ఎవరు ఏ ప్యానల్ లో ఉన్నా, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అందరూ జీవిత, రాజశేఖర్ లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? అని జీవితా ఆగ్రహించింది. గత ఎన్నికలప్పుడు నరేష్ వెంట ఉండి, ఆయన ఏది చెప్తే అది చేసాం.. కానీ ఇపుడు తెలిసి వచ్చింది. నరేష్ అస్సలు ఈసీ మీటింగ్ పెట్టడు.. ‘మా’లో ఏ పని ఆగినా, నరేష్ వల్లే జరిగింది. ఒక లేడీని టార్గెట్ చెయ్యటం సిగ్గుగా లేదా..? అని జీవిత ప్రశ్నించింది. మా అంటేనే అసహ్యం వచ్చేలా, నరేష్ ప్రవహిస్తున్నారు. నరేష్ నారధుడిలా మారారు..’ అని నరేష్ ను లక్ష్యంగా జీవిత విరుకుపడింది.

ఇక పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన కామెంట్స్ ను జీవితా ఖండించింది. పోసాని మాటలు చాలా దారుణమని తెలిపింది. అలా మాట్లాడటం సరికాదని.. భవిష్యత్ లో ఇలాంటివి జరక్కుండా చర్యలు తీసుకోవాలి.. మా ప్యానల్ గెలిస్తే, ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంటాం’ అంటూ జీవిత తెలిపింది.

-Advertisement-పోసాని గారి మాటలు మీద యాక్షన్ తీసుకోవాలి: జీవితా

Related Articles

Latest Articles