‘మా’ అంటేనే అసహ్యం వచ్చేలా, నరేష్ ప్రవర్తిస్తున్నారు: జీవితా

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరుగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు జీవితా రాజశేఖర్ తన మనసులో మాటలు బయటపెట్టేందుకు మీడియా ముందుకు వచ్చారు.

జీవితా మాట్లాడుతూ.. ‘ఎవరు ఏ ప్యానల్ లో ఉన్నా, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అందరూ జీవిత, రాజశేఖర్ లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? గత ఎన్నికలప్పుడు నరేష్ వెంట ఉండి, ఆయన ఏది చెప్తే అది చేసాం.. కానీ ఇపుడు తెలిసి వచ్చింది. నా గుండెల్లోని మాటలు చెప్పాలని మీడియా ముందుకు వచ్చాం. నరేష్ అందరిని కలుపుకు పోలేదు.. అందరిని కలుపుకు పోదాం అని మేం చెప్పాము. ఫారెన్ ప్రోగ్రామ్ విషయంలో నరేష్ తో వివాదాలు మొదలయ్యాయి. నరేష్ అస్సలు ఈసీ మీటింగ్ పెట్టడు.. ‘మా’లో ఏ పని ఆగినా, నరేష్ వల్లే జరిగింది. ఒక లేడీని టార్గెట్ చెయ్యటం సిగ్గుగా లేదా..? అని జీవితా ప్రశ్నించింది.

నాపై మాట్లాడుతున్న ఆరోపణల్లో, ఒక్కటి నిజమని నిరూపిస్తే కాళ్ళ మీద పడి దండం పెడుతా.. మా మెంబర్లు సరిగ్గా ఆలోచించి ఓటు వెయ్యాలి. ఆరెస్సెస్ వాళ్ళు ఫోన్ చేస్తే, నాకు మొదట రావాలి ఫోన్.. ఆరెస్సెస్ వాళ్ళ పేరుతో, పక్క రాష్ట్రం మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. మా అంటేనే అసహ్యం వచ్చేలా, నరేష్ ప్రవర్తిస్తున్నారు. నరేష్ నారధుడిలా మారారు..’ అని నరేష్ ను లక్ష్యంగా జీవిత విరుకుపడింది.

పోసాని మాటలు చాలా దారుణం.. అలా మాట్లాడటం సరికాదు.. భవిష్యత్ లో ఇలాంటివి జరక్కుండా చర్యలు తీసుకోవాలి.. మా ప్యానల్ గెలిస్తే, ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంటాం’ అంటూ జీవితా పోసానిపై విమర్శలు గుప్పించింది.

-Advertisement-‘మా’ అంటేనే అసహ్యం వచ్చేలా, నరేష్ ప్రవర్తిస్తున్నారు: జీవితా

Related Articles

Latest Articles