వారిని ప్రభుత్వం అదుపు చేయలేకపోతోంది : జీవన్ రెడ్డి

రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తి స్థాయిలో జరుగుతుంది అని అసత్యాలు చెపుతున్నారు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. కింటా దాన్యం కి 5 కిలల దాన్యం దోపిడీ చేస్తున్నారు. ప్రతి కింటా పై రైతులు 100 రూపాయలు నష్టపోతున్నారు అని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే రైతు బందు 5 వేలలో 2500 రూపాయలు మిల్లర్లు దోచుకుంటున్నారు. ప్రభుత్వం మిల్లర్ల ఆలోచనలకు అణుగుణంగా పని చేస్తుంది. ఎలెక్ట్రానిక్ వేవ్ బ్రీజ్ రసీదు పై దాన్యం కొనుగోలు చేయాలనీ మా డిమాండ్ అని పేర్కొన్నారు. మిల్లర్లని ప్రభుత్వం అదుపు చేయలేకపోతోంది. గతంలో సన్న వడ్డులు అని రైతాంగాన్ని దివాళా తీయించారు. అలుకులు జల్లే విధానాన్ని తీసుకొస్తున్నారు ..ఈ విధానంతో ఐదు కింతలా దాన్యం తక్కువ వస్తుంది. గతంలో ముఖ్యమంత్రి నిర్ణయంతో రైతులు 10 వేలు నష్టపోయారు. అలుకులు జల్లే విధానాన్ని తీసుకొస్తే మరొకసారి రైతులు 10 వేలు నష్టపోతారు. రైతు లేనిదే రైతు కూలీలు లేరు ..కూలీలు లేనిదే రైతులు లేరు అని స్పష్టం చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-