షాకింగ్: సీనియర్ నటి జయసుధకు ఏమైంది..?

సహజనటి జయసుధ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయం కలబోసిన హీరోయిన్.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన జయసుధ ప్రస్తుతం కుర్ర హీరోలకు తల్లిగా నటిస్తూ తన పాత్రకు తగ్గ న్యాయం చేస్తోంది. ఎటువంటి పాత్రలోనైనా సహజంగా ఒదిగిపోయే జయసుధ గత్ కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో అస్సలు ఆమెకు ఏమైంది అని అభిమానులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవల జయసుధ ఆరోగ్యం దెబ్బ తిన్నదని, చికిత్స నిమిత్తం ఆమె ఎక్కువగా విదేశాలలోనే ఉంటున్నట్లు సమాచారం అందుతోంది.

ఇక తాజాగా జయసుధ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫొటోలో కొత్త రూపంలో సహజ నటి ప్రత్యేక్షమయ్యింది. ఈ ఫొటోలో జయశూద్ర లుక్ పూర్తిగా మారిపోయింది. మునుపటి చార్మింగ్ ఆమె ఫేస్ లో కనిపించడం లేదు. దీంతో నిజంగానే జయసుధ అనారోగ్యం పాలైనట్లు కన్ఫర్మ్ అయ్యింది. బొద్దుగా, హుందాగా కనిపించే జయసుధ.. ఫీలగా, బక్కచిక్కి కనిపించారు. ఆ ఫోటోకి ‘స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ’ అంటూ క్యాప్షన్ పెట్టడంతో ఆమె చికిత్సలో భాగంగానే విదేశాలకు వెళ్లి ఉంటారని అభిమానులు గుసగుసలాడుతున్నారు. ఇక మరికొంతమంది అభిమానులు మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

Latest Articles