భారీ చిత్రాల నిర్మాతకు హార్ట్ సర్జరీ

ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నిర్మాత, పంపిణీదారుడు పెన్ స్టూడియో అధినేత జయంతిలాల్ గడా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఆయనకు హార్ట్ సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. వైద్యులు అతని గుండెలో పేస్‌మేకర్‌ను ఏర్పాటు చేశారు. ఆయన తన ఆఫీస్ లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారని, దాంతో ఆసుపత్రికి చేర్చారని పలు వార్తలు వచ్చాయి. వాటిపై, జయంతిలాల్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు ధవళ్ గడా స్పందించారు.

Read Also : “మిషన్ ఇంపాజిబుల్”లో తాప్సి పాత్ర రివీల్

ధవళ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి ఆఫీస్ కార్యాలయంలో కుప్పకూలిపోయారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని రూమర్స్ ను కొట్టిపారేశారు. కానీ ఆయన హృదయంలో పేస్‌మేకర్‌ను ఏర్పాటు చేసినట్లు అంగీకరించారు. తన తండ్రి ప్రస్తుతం బాగానే ఉన్నారని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ధవల్ తెలియజేశారు. కాగా ప్రస్తుతం ఈ టాప్ ప్రొడ్యూసర్ ఇండియాలో తెరకెక్కుతున్న పలు భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆ జాబితాలో “ఆర్‌ఆర్‌ఆర్, గంగూబాయి కతియావాడి, బెల్ బాటమ్, ఖిలాడి, ఛత్రపతి బాలీవుడ్ రీమేక్” వంటి కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఉండడం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-