చిట్టి ఫరియా డ్యాన్స్‌కు నెటిజ‌న్స్ ఫిదా

హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. తొలి సినిమాతోనే (జాతి రత్నాలు) అందరి మనసులు గెలుచుకుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన డ్యాన్సింగ్ ట్యాలెంట్‌కి సంబంధించిన వీడియోల్ని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. కొద్ది రోజులుగా హైద‌రాబాద్ న‌గ‌రం వ‌ర్షంలో త‌డిసి ముద్ద‌వుతుండ‌గా, రుతుపవ‌నాల రాక‌తో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నానంటూ ఫ‌రియా త‌న డ్యాన్స్ వీడియోలు షేర్ చేసింది. తన డ్యాన్స్ వీడియో క్లిప్ లలో ‘ఆజా రీ మోర్ సైయన్’ పాటకు క‌థ‌క్ స్టైల్‌లో డ్యాన్స్ చేసి నెటిజన్స్ ను అల‌రించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles