సామాన్యుడి ప్రేమలో రాజకుమారి.. అతడి కోసం అన్నీ వదిలి..!

ప్రేమ ఎప్పుడు.. ఎవరిపై.. ఎలా పుడుతుందో తెలియదు.. ఇప్పటికే చాలా లవ్ స్టోరీలు చూశాం.. ప్రేమించినవాడి కోసం ఆస్తులు, అంతస్తులు త్యాగాలు చేసినవారు ఎందరో.. కన్నవారిని వదిలి కోరుకున్నవాడి కోసం పరితమింపే హృదయాలు మరెన్నో.. ఇదే కోవలోకి వస్తారు జపాన్‌ రాకుమారి మకో.. సామాన్యుడిలో లవ్‌లో మునిగిపోయిన ఆమె.. సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. సంప్రదాయం ప్రకారం సామాన్యుడిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యారు రాకుమారికి.. వివాహం సందర్భంగా రాజ కుటుంబం భారీగా డబ్బులు ఇవ్వడం అనవాయితి అట.. 1.2 మిలియన్‌ అమెరికా డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.8.77 కోట్లు రాజకుమారికి ఇవ్వాలనుకున్నారట.. కానీ, ఆ మొత్తాన్ని తీసుకునేందుకు మాకో తిరస్కరించారట.

29 ఏళ్ల ప్రిన్సెస్ మాకో.. జపాన్ ప్రస్తుత రాజు నరుహిటో సోదరుడు ప్రిన్స్ అకిషినో కుమార్తె.. ఆమె తన ప్రియుడు కొమురోను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. వివాహం తర్వాత ఆమె అమెరికాలో స్థిరపడాలనే ఆలోచనలు ఉన్నారు.. ఈ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ, మొత్తానికి ఈ వివాహానికి రాజ కుటుంబం కూడా అంగీకారం తెలిపిందట. యువరాణి మాకో ప్రియుడు కొమురో యూఎస్‌లో న్యాయశాస్త్రం అభ్యసిస్తున్నాడు.. మాకో 2013 డిసెంబర్ లో డిన్నర్‌ సమయంలో తన ప్రియుడు కొమురోతో వివాహం ప్రతిపాదించారని నివేదించబడింది. అయితే, తమ ప్రేమ విషయాన్ని చాలా కాలం దాడిపెట్టారు ఈ ప్రేమికులు.. ఇక, 2017లో బ్రిటన్‌లో చదువుకోవడానికి వెళ్లిన యువరాణి.. నవంబర్ 2018లో మాకోను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది, కానీ, ఆమె వివాహం 2020కి వాయిదా వేసింది. మాకో తన బాయ్‌ఫ్రెండ్ కొమురోను ఎంతగానో ప్రేమిస్తుంది, అతడి కోసం ఏకంగా ఏడు వివాహాల ఆఫర్లను తిరస్కరించిందట.. ఇప్పుడు మొత్తంగా రాకుమారి వివాహానికి ఆమె ఫ్యామిలీ కూడా అంగీకారం తెలపడంతో.. నచ్చిన, మెచ్చిన వాడిని త్వరలోనే వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతోంది జపాన్ యువరాణి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-