మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కునున్న హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ని ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమాను ఇలా ప్రకటించారో లేదో అలా ఊహాగానాలు మొదలైపోయాయి. సినిమా కథ దగ్గర నుంచి హీరో పాత్ర, సినిమా టైటిల్, హీరోయిన్ ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని, సినిమాకు మేకర్స్ ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘ఎస్ఎస్ఎంబి28’లో బాలీవుడ్ బ్యూటీ నటించబోతోందనే టాక్ నడుస్తోంది. మొదటి సినిమాతోనే ఎంతోమంది హృదయాలను దోచుకున్న బాలీవుడ్ దివా జాన్వి కపూర్ ఈ చిత్రంలో మహేష్ బాబుతో జోడి కట్టనుందట. జాన్వీ టాలీవుడ్ అరంగ్రేటం గురించి కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మన నిర్మాతలు జాన్వీని తెలుగు తెరపై ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ జాన్వీ ఇప్పటి వరకు టాలీవుడ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా ‘ఎస్ఎస్ఎంబి28’ ప్రాజెక్ట్ కోసం ఈ బ్యూటీని తీసుకురావడానికి ఆసక్తిని కనబరుస్తున్నారట మేకర్స్. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-