ప్రపంచంలోనే కూలెస్ట్ మ్యాన్… ‘పుష్ప’రాజ్ కు పడిపోయిన స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘పుష్ప’రాజ్ హవా నడుస్తోంది. బీటౌన్ మొత్తం ‘పుష్ప’ ఫైర్ అంటుకుంది. స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు సైతం ‘పుష్ప’రాజ్ కు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే సినిమాను వీక్షించిన పలువురు ప్రముఖులు, సినీ, క్రికెట్ రంగాల్లోని ప్రముఖులు ఐకాన్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బాలీవుడ్ స్టార్ కరణ్ జోహార్ అయితే ఏకంగా ‘ఆర్య’ నుంచే బన్నీకి ఫ్యాన్ ను అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన చెల్లి జాన్వీ కపూర్ కూడా ‘పుష్ప’రాజ్ కు ఫిదా అయినట్టు కన్పిస్తోంది.

Read Also : అనుమానాస్పద స్థితిలో హాస్యనటుడి మృతి… హోటల్ గదిలో శవం

నిన్న రాత్రి జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో’ పుష్ప’లో అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపించింది. “పుష్ప : ది రైజ్‌” నుంచి తాజా స్టిల్‌ను షేర్ చేస్తూ ” పుష్ప మైండ్ బ్లోన్’ అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు ‘పుష్ప’రాజ్ ప్రపంచంలోనే కూలెస్ట్ మ్యాన్ అంటూ బన్నీని ఆకాశానికెత్తేసింది. ఇప్పటికే బాలీవుడ్ లో మన హీరోలు విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా బీటౌన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

janhvi kapoor praises allu arjun in pushpa the rise

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’లో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, ధనంజయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సమంత ‘ఊ అంటావా ఊ ఊ అంటవా’ అనే స్పెషల్ సాంగ్‌లో కన్పించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతుంది.

Related Articles

Latest Articles