ఈ నెల 26 నుంచి రైతుల పాదయాత్రకు జనసేన !

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని… రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్‌ సర్కార్‌ తీసుకున్న.. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని… ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే చేయాలన్నది వారి డిమాండ్‌. అయితే.. రైతుల ఉద్యమానికి… ప్రతి పక్షాలు అన్ని ఇప్పటికే మద్దతు తెలిపాయి. ఇక తాజాగా జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది.

ఈ నెల 26వ తేదీన రాజధాని రైతుల పాదయాత్రలో జనసేన ముఖ్య నేతలు పాల్గొననున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది. నెల్లూరు జిల్లాలో రాజధాని రైతులను కలిసి జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సంఘీభావం తెలపనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు… నెల్లూరు జిల్లా నార్త్‌ రాజుపాలెం వద్ద పాదయాత్రలో పాల్గొననున్నారు నాదెండ్ల. ఇక ఈ పాదయాత్రలో నాదెండ్లతోపాటు పాల్గొననున్నారు జనసేన రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు.

Related Articles

Latest Articles