జ‌న‌సేన పార్టీ కీల‌క స‌మావేశం… బ‌ద్వేల్‌ ఉప ఎన్నిక‌పై చ‌ర్చ‌…

ఈరోజు జ‌న‌సేప పార్టీ నేత‌ల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మావేశం నిర్వ‌హించ‌బోతున్నారు.  పార్టీ విస్తృత‌స్థాయి స‌మావేశాల్లో కీలక అంశాలపై చ‌ర్చించ‌బోతున్నారు.  రాష్ట్రంలో ప్ర‌భుత్వ విధానాలు, రోడ్ల మ‌ర‌మ్మ‌త్తులు త‌దిత అంశాల‌తో పాటుగా, అక్టోబ‌ర్ 2 వ తేదీన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తూర్పు గోదావ‌రి, అనంత‌పురం జిల్లాల్లో శ్ర‌మదానం కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌బోతున్నారు.  దీనిపై కూడా ఈరోజు స‌మావేశంలో చ‌ర్చించ‌బోతున్నారు.  అదేవిధంగా, అక్టోబ‌ర్ 30 వ తేదీన బద్వేలుకు ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌డ‌ప జిల్లా నేత‌ల‌తో చ‌ర్చించ‌బోతున్నారు.  జ‌న‌సేన పోటీ చేస్తే అభ్య‌ర్థిని ఎవ‌ర్ని నియ‌మించాలి అనే అంశంపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేత‌ల‌తో చ‌ర్చించ‌నున్నారు.  రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై,  పార్టీ బ‌లోపేతంపై కూడా ప‌వ‌న్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  

Read: మ‌హిళ‌లకు గుడ్ న్యూస్‌: త‌గ్గిన పుత్త‌డి ధ‌ర‌లు

-Advertisement-జ‌న‌సేన పార్టీ కీల‌క స‌మావేశం... బ‌ద్వేల్‌ ఉప ఎన్నిక‌పై చ‌ర్చ‌...

Related Articles

Latest Articles