151 సీట్లు కాస్త 15 సీట్లుగా మారే రోజు ఎంతో దూరంలో లేదు..!

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 151 సీట్లు కాస్త 15 సీట్లుగా మారే రోజు ఎంతో దూరంలో లేదని కామెంట్ చేశారు జనసేన నేతలు.. చిత్తూరు జిల్లా కుప్పంలో జనసేన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.. సమావేశానికి ముందు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించిన జన సైనికులు ఆ తర్వాత సమావేశమయ్యారు.. ఆ మీటింగ్‌కు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, జనసేన కుప్పం ఇంచార్జి డాక్టర్ వెంకటరమణ తదితరులు హాజరు కాగా.. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ల్యాండ్, ఇసుక మాఫియా కొనసాగుతోందని ఆరోపించారు.. 151 సీట్లు కాస్త 15 సీట్లుగా మారే రోజు ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించిన ఆయన.. వైసీపీ ఎమ్మెల్యేలు ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారని.. రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడిందని మండిపడ్డారు.

-Advertisement-151 సీట్లు కాస్త 15 సీట్లుగా మారే రోజు ఎంతో దూరంలో లేదు..!

Related Articles

Latest Articles