రేపు విజ‌య‌వాడ‌కు జ‌న‌సేనాని…

తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గానికి జ‌ర‌గిన ఉప ఎన్నిక త‌రువాత జ‌న‌సేన పార్టీ సైలెంట్ అయింది. క‌రోనా నిబంధ‌న‌లు ఎత్తివేస్తుండ‌టంతో పార్టీ పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.  రాష్ట్రంలో తాజా పరిస్థితుల‌పై నేత‌ల‌తో చ‌ర్చించేందుకు జ‌న‌సేనాని సిద్ధం అవుతున్నారు.  ఇందులో భాగంగా జులై 6 వ తేదీన విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించ‌బోతున్నారు.  విజ‌య‌వాడ‌లో ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశం అవుతారు.  తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదాలు, ఇటీవ‌లే ప్ర‌భుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండ‌ర్‌, రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్యలు వంటి వాటిపై చర్చించ‌బోతున్నారు.  

Read: ప్రియాంక నాయకత్వంపై యూపీ కాంగ్రెస్ ధీమా… వచ్చే ఎన్నికల్లో…

విజయవాడ ప‌ర్య‌ట‌న అనంతరం ప‌వ‌న్ క‌ళ్యాణ్ జులై 7 వ తేదీన మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్‌లో ముఖ్య‌నేత‌ల‌తో సమావేశం అవుతారు.  రాబోయో రోజుల్లో పార్టీ కార్యక్రమాల గురించి, ప్రజల్లో పార్టీని ఎలా తీసుకెళ్లాలి, పార్టీ బలోపేతం గురించి సమావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది.  పార్టీకి చెందిన పలువురు నేతలతో జ‌న‌సేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈరోజు సమావేశం కానున్నారు.  

Related Articles

Latest Articles